PLD: యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు క్రీడలు ఎంతో దోహదపడతాయని జిల్లా టీడీపీ అధ్యక్షుడు జానీ బాషా అన్నారు. బుధవారం అమరావతిలోని SRKH హైస్కూల్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ను ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ఇలాంటి టోర్నమెంట్లు యువత ప్రతిభ చాటుకోవడానికి ఒక మంచి వేదికగా నిలుస్తాయని హర్షం వ్యక్తం చేశారు.