ATP: సంక్షేమ శాఖలకు కేటాయించిన లక్ష్యాలను అధికారులు వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. దివ్యాంగులందరికీ వంద శాతం యుడిఐడి కార్డులు మంజూరు చేయాలని సూచించారు. హాస్టళ్లలో మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలు కల్పించాలని అన్నారు.