KDP: కలసపాడు మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత రానున్నట్లు కలసపాడు ఎంపీడీవో మహబూబ్ తెలిపారు. చింతలపల్లె, శంకరావరం, తంబాళ్ల పల్లె, చెన్నుపల్లె గ్రామాలలో పర్యటించి అక్కడ సీసీ రోడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొంటారన్నారు. కావున అన్ని శాఖల అధికారులు హాజరు కావాలన్నారు.