TG: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజన కుటుంబాల పునరావాస ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పునరావాస ప్రాంతాలకు వెళ్లేందుకు అంగీకరించిన 14 కుటుంబాలకు అసెంబ్లీ కమిటీ హాల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రూ.15 లక్షల చొప్పున చెక్కులు పంపిణీ చేశారు.