GDWL: ఐడీవోసీ మందిరంలో బుధవారం జరిగిన ఐక్యరాజ్యసమితి మోడల్ ప్రతినిధుల సమావేశంలో జిల్లాలోని 23 పీఎంశ్రీ పాఠశాల విద్యార్థులు 46 మంది పాల్గొన్నారు. ఇందులో అయిజ బాయ్స్ హైస్కూల్ విద్యార్థి రవిచంద్ర పాల్గొని తనదైన శైలిలో ప్రతిభ కనబరిచాడు. దీంతో అతడిని నిర్వాహకులు రాష్ట్రస్థాయి ఐక్యరాజ్యసమితి మోడల్ ప్రజా ప్రతినిధుల సమావేశానికి ఎంపిక చేశారు.