GDWL: జిల్లాలో వేసవి కాలంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. బుధవారం గద్వాల కలెక్టరేట్లో సమ్మర్ యాక్షన్ ప్లాన్‌పై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏప్రిల్ 1 నుంచి 15 లోపు చేతి పంపులు, మోటర్లు, పైప్ లైన్లకు అవసరమైన మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశించారు.