హర్మూజ్‌ను మూసివేయడంతో ఎరువుల రవాణాకు ఆటంకం ఏర్పడుతోందని ప్రపంచ వాణిజ్య సంస్థ పేర్కొంది. ఎరువుల కొరత, అధిక ధరల రూపంలో ప్రపంచ ఆహార భద్రతకు ముప్పు కలిగే అవకాశముందని హెచ్చరించింది. ప్రపంచంలోని మూడింట ఒక వంతు ఎరువులు గల్ఫ్ దేశాల నుంచి హర్మూజ్ మీదుగానే రవాణా అవుతాయి. దీంతో ఆహారాన్ని దిగుమతి చేసుకునే పేద దేశాలు దయనీయ పరిస్థితులను ఎదుర్కొనే ప్రమాదం ఉందని తెలిపింది.