రామ్ చరణ్ షూటింగ్లో గాయపడ్డారనే వార్తలపై ‘పెద్ది’ చిత్ర బృందం స్పందించింది. షూటింగ్ సమయంలో చరణ్ కుడి కంటికి స్వల్ప గాయమైందని, వెంటనే ఆయన వైద్య చికిత్స తీసుకున్నారని చిత్ర యూనిట్ వెల్లడించింది. ప్రస్తుతం ఆయన కోలుకున్నారని, రేపటి నుంచే షూటింగ్లో పాల్గొంటారని స్పష్టం చేసింది. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చింది.