తూ.గో.జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాల మేరకు రాజమండ్రిలో అనూరియా కేసుల క్లస్టర్‌పై జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. కే.వెంకటేశ్వరరావు వివరాలు ప్రకారం రాజమండ్రికి చెందిన నలుగురు వ్యక్తులు అనూరియా లక్షణాలతో ఆసుపత్రిలో చేరినట్లు చెప్పారు. జిల్లా సర్వైలెన్స్ అధికారికి సమాచారం అందించి విచారణ ప్రారంభించామన్నారు.