PPM: జిల్లాలో ఎన్నికల రోల్స్ మ్యాపింగ్, ఫారంల పరిశీలన పక్కగా జరుగుతుందని జిల్లా రెవెన్యూ అధికారిణి కే.హేమలత అన్నారు. ఆమె ఛాంబర్లో బుధవారం జిల్లాలోని గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, సమర్ధవంతంగా కొనసాగేందుకు రాజకీయ పార్టీలతో సమన్వయం అత్యంత కీలకమన్నారు.