VSP: మధురవాడ కళానగర్ 61వ సచివాలయం వద్ద బుధవారం సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సీపీఐ నేత మరుపిళ్ల పైడిరాజు డిమాండ్ చేశారు. పేదలకు ఇళ్ల స్థలాలు, పెన్షన్లు, రేషన్ కార్డులు వెంటనే మంజూరు చేయాలని కోరారు. టిడ్కో ఇళ్ల పంపిణీ ఆలస్యం, జీవో-23తో స్థలాల కేటాయింపులో జాప్యం జరుగుతోందని విమర్శించారు.