ASF: జిల్లా పోలీసులు రూ.10 లక్షల విలువైన 108 పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను రికవరీ చేశారు. జిల్లా ఎస్పీ నితిక పంత్ ఐపీఎస్ వీటిని బాధితులకు అందజేశారు. ఫోన్ పోతే వెంటనే ceir.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని ఆమె సూచించారు. టెక్నాలజీ సాయంతో ఫోన్లను త్వరగా కనిపెట్టవచ్చని ఎస్పీ పేర్కొన్నారు. ఫోన్లు రికవరీ చేసి తిరిగి అందచేసిన పోలీసులకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.