WGL: పట్టణకేంద్రంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ 3 రోజులు బంద్ ఉన్నట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. శుక్రవారం శ్రీరామనవమి, శనివారం, ఆదివారం వారాంతపు సెలవుల నేపథ్యంలో మార్కెట్‌ను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రైతులు గమనించి మూడు రోజులు సరుకులు తీసుకుని రావద్దని విజ్ఞప్తి చేశారు. మార్కెట్ తిరిగి సోమవారం ప్రారంభం కానుంది.