AP: మాజీ MLC ఆదిరెడ్డి అప్పారావు ఆడియో లీక్ వ్యవహారంలో కీలక మలుపు జరిగింది. ఈ అంశంపై చంద్రకళ స్పందిస్తూ.. అప్పారావు తమను తిట్టలేదని, ఆ ఆడియోలో వినిపిస్తున్న మాటలు ఆయనవి కావని స్పష్టం చేశారు. తమ కుటుంబ వ్యవహారం ప్రస్తుతం కోర్టులో ఉందని, దీనిని ఆసరాగా చేసుకుని వైసీపీ రాజకీయాలు చేయడం మానుకోవాలన్నారు. తన కోడలు కావాలనే ఇవన్నీ సృష్టించి ఆరోపణలు చేస్తోందని పేర్కొన్నారు.