ASR: కొయ్యూరు మండలానికి నూతనంగా నియమితులైన ఎంఈవో పాటి సింహాచలంను బుధవారం బాలల హక్కుల పరిరక్షణ కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. మండలంలోని పాఠశాలల సమస్యలు పరిష్కరించి, అవసరమైన చోట కొత్త భవనాలు ఏర్పాటు చేయాలని కోరారు. విద్యార్థులకు మెరుగైన విద్య అందించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.