MNCL: అంగన్వాడీ కేంద్రాల్లో అందిస్తున్న సేవలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ నాందేవ్ సూచించారు. బుధవారం మంచిర్యాల ఏసీసీ 3 అంగన్వాడీ కేంద్రంలో సీబీఈలో భాగంగా సుపోషణపై ఆయన అవగాహన కల్పించారు. గర్భిణీలు, బాలింతలు, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే పోషక పదార్థాలతో కూడిన ఆహారం తీసుకోవాలన్నారు. టీచర్ ఎన్. పద్మ పాల్గొన్నారు.