JN: మంత్రి సీతక్కను పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి కలిసి వినతిపత్రం అందజేశారు. రాయపర్తి మండలంలోని మైలారం గ్రామ సమస్యలను మంత్రి సీతక్కకు ఎమ్మెల్యే వివరించారు. సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, పాలకుర్తి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తావించిన ఆంశంపై మంత్రి సానుకులంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.