ఇళ్లలో పెట్రోల్, డీజిల్ నిల్వ చేయడం పెట్రోలియం చట్టం-1934 ప్రకారం నేరమని అధికారులు చెబుతున్నారు. డబ్బాల్లో నిల్వచేస్తూ పట్టుబడితే జరిమానాతో పాటు జైలుశిక్ష తప్పదని హెచ్చరించారు. తొలిసారి పట్టుబడితే రూ. 1000, నెల జైలు శిక్ష, రెండోసారి పట్టుబడితే రూ. 5వేలు, 3 నెలల జైలు శిక్ష పడుతుందన్నారు. ప్రమాదాలు జరిగితే కఠినమైన క్రిమినల్ కేసులు నమోదవుతాయన్నారు.