హీరో రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబోలో ‘పెద్ది’ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్లో రామ్ చరణ్ గాయపడ్డాడు. దీనిపై పవన్ కళ్యాణ్ తాజాగా స్పందించాడు. ‘చరణ్ గాయపడ్డాడని తెలిసింది. అతడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా’ అని పవన్ పేర్కొన్నాడు.