Crore Salary: మంచి ఉద్యోగం, అధిక జీతం కోసం చాలా మంది విదేశాలకు వెళ్తుంటారు. విదేశాల్లో అధిక ఖర్చుల వల్ల జీవిత భాగస్వామిని స్వదేశంలో వదిలి వెళ్ళే వారు చాలా మంది ఉన్నారు. భర్త ఒక దేశంలో ఉద్యోగం చేస్తుంటే భార్య వేరే దేశంలో ఉద్యోగం, ఇల్లు, పిల్లలను చూసుకుంటూ ఉంటుంది. హాయిగా కలిసి జీవించే ఉద్యోగం వస్తే ఎంత బాగుంటుందో ఆలోచించేవాళ్లు కలిసి ట్రిప్ కు వెళ్లినప్పుడు తిరిగి రాకూడదని అనుకుంటారు.
సముద్రం, ద్వీపం, ప్రశాంత వాతావరణం ఉన్న ప్రదేశానికి వెళ్లిన సమయంలో.. ఇద్దరూ కలిసి గడపడానికి ఇష్టపడతారు. డబ్బు అయిపోయిన తర్వాత తిరిగి రావడం అనివార్యం అవుతుంది. మీరు మీ భాగస్వామితో అందమైన వాతావరణంలో గడపాలనుకుంటే మాత్రం మంచి అవకాశం ఉంది. మీరు హ్యాపీగా ఐలాండ్ ట్రిప్ వెళితే.. అదే ఉద్యోగం, మీకు జీతం కూడా వస్తుంది.
న్యూయార్క్ పోస్ట్ యొక్క నివేదిక ప్రకారం.. ఫెయిర్ ఫాక్స్ , కెన్సింగ్టన్ అనే రిక్రూట్మెంట్ ఏజెన్సీ దీని గురించి తెలియజేసింది. ఇది పూర్తి సమయం ఉద్యోగం. మీ భాగస్వామితో కలిసి పని చేయాలి. ఉద్యోగానికి బదులుగా మంచి సౌకర్యాలతోపాటు అధిక జీతం పొందుతారు. ప్రైవేట్ ద్వీపంలో పని చేయాలి.
జంట ద్వీపంలో గడిపిన సమయాన్ని డాక్యుమెంట్ చేయాలి. ఇక్కడి అందాలను ప్రపంచానికి చాటి చెప్పాలనే ఉద్దేశంతో నియామకం జరుగుతోంది. బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్‌లో ఉండేందుకు ఎలాంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. కపుల్‌కు 185,000 డాలర్లు అంటే 1,54,03,729 రూపాయలు జీతం ఇస్తారు.
ద్వీపంలో నివసించే జంటకు అన్ని రకాల సౌకర్యాలు లభిస్తాయి. ఏడాదికోసారి స్వగ్రామానికి వెళ్లే అవకాశం ఉంది. దంపతులు వారానికి 6 రోజులు పని చేయాల్సి ఉంటుంది. ఏడాదికి 25 రోజుల సెలవులు కూడా లభిస్తాయి.
బ్రిటిష్ వర్జిన్ దీవులలో (వర్జింగ్ ఐలాండ్) నివసిస్తుందని చెప్పబడినా, ఏ ద్వీపం గురించి సమాచారం ఇవ్వలేదు. ఉద్యోగం ఇచ్చే వ్యక్తికి సంబంధించిన సమాచారాన్ని దాచి ఉంచారు. పనిచేసే జంట సోషల్ మీడియా, టెక్నాలజీ గురించి అవగాహన కలిగి ఉండాలి. పడవలు లేదా పెద్ద ఇళ్లలో పనిచేసిన అనుభవం ఉండాలి. జనవరి నుంచి పని ప్రారంభించనున్నట్లు సమాచారం. దంపతులు తమ టిక్‌టాక్ వీడియోను అప్లికేషన్‌తో పంచుకోవాలి. యజమానులు వారి వీడియోలను తనిఖీ చేస్తారు. ఈ వార్త విని కొందరు షాక్ అవుతున్నారు.