BDK: శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా ఇవాళ ఆలయంలో అగ్నిప్రతిష్ఠ కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రధాన ఘట్టాల కోసం భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 26న ఎదుర్కోలు ఉత్సవం, 27న కళ్యాణం, 28న పట్టాభిషేకం నిర్వహించనున్నారు.