MBNR: మహబూబ్నగర్ జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందనే వార్తలను బంకుల యజమానులు ఖండించారు. జిల్లాలో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, సరఫరా సజావుగా సాగుతోందని స్పష్టం చేశారు. ప్రజలు ఆందోళనతో బంకుల వద్ద రద్దీ చేయవద్దని, కేవలం అవసరమైన మేరకే ఇంధనం తీసుకోవాలని వారు కోరారు. తప్పుడు ప్రచారాలను నమ్మి కంగారు పడవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.