భూత్ బంగ్లా ప్రమోషన్లలో భాగంగా హీరో అక్షయ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాలో ఆయనకు జోడీగా వామికా గబ్బి నటిస్తున్నారు. అయితే వీరిద్దరి మధ్య 26 ఏళ్ల గ్యాప్ ఉండడంపై ఆయన స్పందించారు. కథకు అవసరమైన వారిని ఎంపిక చేసుకుంటామని తెలిపారు. ఒక నటుడి అసలు వయసుకి, స్క్రీన్ వయసుకి చాలా తేడా ఉంటుందని.. ఇందులో నాకైతే ఎలాంటి సమస్య కనిపించడం లేదన్నారు.