KNR: శంకరపట్నం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం ప్రజాపాలనా ప్రగతి ప్రణాళికలో భాగంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు వైద్యాధికారి డాక్టర్ శ్రావణ్ తెలిపారు. ఈ శిబిరంలో పిల్లలు, దంత, కంటి, ఎముకల నిపుణులతో పాటు జనరల్ మెడిసిన్ వైద్యులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.