TG: తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఇంధన కొరత లేదని స్పష్టం చేసింది. HPCL, IOCL, BPCL కంపెనీల దగ్గర సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని వెల్లడించింది. ఇంధన కొరత ఉందన్న ప్రచారాన్ని ఖండించింది. బంకుల దగ్గర విపరీతమైన రద్దీతో తాత్కాలికంగా కొరత ఏర్పడిందని తెలిపింది.