హీరో రామ్ పోతినేని తన నెక్ట్స్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ శిష్యుడు లోగి విఘ్నేశ్ చెప్పిన కథకు రామ్ ఓకే చెప్పాడని తెలుస్తోంది. నిర్మాణ సంస్థపై స్పష్టత రాగానే అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ మూవీ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందనుందని సమాచారం.