RR: ఫార్మాసిటీ కోసం భూములు ఇవ్వని రైతులకు కూడా రైతు భరోసా కల్పించాలని యాచారం మండలం తాడిపర్తి గ్రామ సర్పంచ్ నీలం ఝాన్సీ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఆన్లైన్లో రైతుల పేర్లు నమోదు కాకపోవడంతో వారికి భరోసా అందడం లేదని, ఇది అన్యాయం అవుతోందని తెలిపారు. రైతుల పేర్లు ఆన్లైన్లో నమోదు చేసి వెంటనే రైతు భరోసా అందించాలని కోరారు.