»Pawan Kalyan Speech In Modi Meeting Hyderabad Bc Atmagourava Sabha
Pawan Kalyan: నీళ్లు, నిధులు, నియామకాలు అందరికీ అందాయా?
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలు సరిగ్గా అమలు అవుతున్నాయా అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజలను ప్రశ్నించారు. మాటలు కాకుండా పనులు చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని పవన్ ప్రజలను కోరారు.
Pawan Kalyan speech in modi meeting hyderabad bc atmagourava sabha
సకల జనుల సమ్మె చేస్తే తెలంగాణ వచ్చిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) అన్నారు. అలా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలు సరిగ్గా అమలు అయ్యాయా అని ప్రశ్నించారు. దాదాపు తెలంగాణ ఏర్పాటై పదేళ్లు కావాస్తున్నా నిరుద్యోగం మాత్రం అలాగే ఉందని గుర్తు చేశారు. అంతేకాదు అధికార ప్రభుత్వం అణగారిన వర్గాలకు సీఎం పదవి ఇస్తానని చెప్పిన హామీ ఇంతవరకు అమలు చేయలేదన్నారు. మాటలు చెప్పే సీఎం కాదు. చేతలు చేసే పార్టీ రావాలని కోరారు. మోడీ గారి నాయకత్వంలో బీసీల తెలంగాణ రావాలని పవన్ ఆకాంక్షించారు. సామాజిక తెలంగాణ నిలదొక్కుకోవాలంటే బీసీ నేత ముఖ్యమంత్రి కావాలని పవన్ కోరారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ బీజేపీకి సంపూర్ణ మద్ధతు ఇస్తుందని ప్రకటించారు.
అంతేకాదు ప్రధాని మోడీని తనదైన శైలిలో పవన్ మెచ్చుకున్నారు. నిజంగా మోడీ(modi) ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పనిచేయడం లేదన్నారు. అలా చేసి ఉంటే 370 రద్దు, ట్రిపుల్ తలాక్, రామ మందిరం వంటి అనేక కీలక నిర్ణయాలు తీసుకునే వారు కాదన్నారు. ఆయన ఎప్పుడూ దేశ ప్రయోజనాల గురించే ఆలోచిస్తారని చెప్పారు. 2004 నుంచి 2014 వరకు ఎన్నో రకాల ఉగ్ర దాడులు జరిగినట్లు పవన్ గుర్తు చేశారు. అలాంటి పరిస్థితుల్లో దేశానికి బలమైన నాయకుడు కావాలని తన లాగే అనేక మంది ఆలోచించారని..అప్పుడే మోడీ వచ్చారని చెప్పారు. ఒక దేశం అభివృద్ధి కావాలంటే దేశ అంతర్గత భద్రత చాలా కీలకమని గుర్తు చేశారు. మన దేశం మీద దాడులు చేస్తే..ప్రతి భారతీయుడుకి గుండెల్లో ధైర్యం నింపిన వ్యక్తి మోడీ అని పవన్ ప్రశంసించారు. స్వచ్ఛభారత్, పటిష్టమైన విదేశాంగ విధానం సహా అనేక పథకాలను అమలు చేస్తున్న బీజేపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాలని పవన్ ఆకాంక్షించారు.
ఈ సభలో తొమ్మిదేళ్ల విరామం తర్వాత టాలీవుడ్ స్టార్ హీరో, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి వేదిక పంచుకున్నారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ‘బీసీ ఆత్మ గౌరవ’ (వెనుకబడిన కులాల ఆత్మగౌరవం) బహిరంగ సభ(bc atmagourava sabha)లో మోడీతో పక్కన కూర్చున్నారు. ఆ క్రమంలో పవన్ కల్యాణ్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని కోరారు.