»Minister Mallareddy Has Protest Local People On Their Lands
Minister Mallareddy: తమ భూములు ఆక్రమించాడని..చెప్పులతో గిరిజనుల ఆందోళన
తెలంగాణ బీఆర్ఎస్ మంత్రి మల్లారెడ్డి తమ భూములు ఆక్రమించారని గిరిజనులు నిరసన వ్యక్తం చేశారు. సుమారు 150 కోట్ల విలువైన 47 ఎకరాలు భూమి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపణలు చేశారు. అయితే ఈ భూమి ఎక్కడుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
Minister Mallareddy has protest local people on their lands
తెలంగాణ మంత్రి మల్లారెడ్జి(Minister Mallareddy)పై గిరిజన భూ నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ భూములు మల్లారెడ్డి ఆక్రమించుకున్నారని పేర్కొన్నారు. మూడుచింతలపల్లి మండలంలోని కేశవరం గ్రామంలో సర్వే నంబర్ 33,34,35లో దాదాపు 47 ఎకరాల 18 గంటల భూమిని మల్లారెడ్డి పలువురు బీఆర్ఎస్ నేతలతో కలిసి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని గిరిజనులు తాజాగా ఆరోపించారు. ఈ నేపథ్యంలో అనంతరం గేట్ ముందు చెప్పులు, ప్లకార్డులు పట్టుకుని తమకు న్యాయం చేయాలని నిరసన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతగా మంత్రి మల్లారెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, అతనికి చెప్పినా తమ గొడు వినడం లేదని అంటున్నారు.
ఇటివల బిక్షపతి అనే వ్యక్తికి మంత్రి మాయమాటలు చెప్పి కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి 47 ఎకరాల భూమిని రాత్రికి రాత్రే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. అయితే బిక్షపతి తమకు రెండు లక్షల రూపాయలు ఇచ్చి మళ్లీ కలుస్తానని ఇంతవరకు కలువలేదన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి మల్లా రెడ్డి డబ్బులు ఇవ్వకుండా తమను మోసం చేశాడని బాధిత గిరిజనులు(Tribal people) అంటున్నారు. దాదాపు 150 కోట్ల రూపాయల విలువైన భూమిని ఆక్రమించుకుని తమకు గూడు లేకుండా చేశారని బాధితులు వాపోతున్నారు. తమకు న్యాయం చేయకుంటే మంత్రి మల్లారెడ్డి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. అంతేకాదు గతంలో కూడా పలువురు కూడా తమ భూములు మంత్రి మల్లారెడ్డి అక్రమంగా ఆక్రమించుకున్నారని ఆరోపణలు చేశారు. అయితే ఈ అంశంపై మంత్రి మల్లారెడ్డి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.