Komati Reddy Venkat Reddy: కాంగ్రెస్ అంటేనే గ్రూపు రాజకీయాలు.. నలుగురు నేతల మధ్య సఖ్యత ఉండదు. ఇక ఆ పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థులు ఓ డజన్ మంది ఉంటారు. ఇప్పుడు రేవంత్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు.. ఇలా చాలా మందే ఉంటారు. ఎన్నికల ప్రచారంలో నేతలు అంతా కలిసి పాల్గొంటున్నారు.
నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థిగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komati Reddy Venkat Reddy) మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ తీశారు. ఆ క్రమంలో హాట్ కామెంట్స్ చేశారు. నల్గొండ నుంచి కోమటిరెడ్డి సీఎం అయ్యే రోజు వస్తోంది.. ఏదో ఒక రోజు ముఖ్యమంత్రిని అవుతానని అన్నారు. ఇప్పుడే సీఎం అవాలనే తొందర తనకు లేదన్నారు.
కోమటిరెడ్డి కామెంట్స్ కాంగ్రెస్ పార్టీలో చర్చకు దారితీసింది. దీనిపై మిగతా నేతలు స్పందించాల్సి ఉంది. ఫైర బ్రాండ్ జగ్గారెడ్డి కూడా తాను సీఎం అభ్యర్థినని చెప్పుకుంటారు. నామినేషిన వేసిన తర్వాత మాట్లాడిన వెంకట్ రెడ్డి.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఏపీలో నష్టం జరుగుతుందని తెలిసి కూడా సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని గుర్తుచేశారు.
ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని మండిపడడ్డారు. ఉద్యోగ ఖాళీల భర్తీలో సర్కార్ ఫెయిల్ అయ్యిందని మండిపడ్డారు. పోలింగ్ చివరి రోజున రైతుబంధు డబ్బులు వేస్తారని పేర్కొన్నారు. మోసపోవద్దని వయోజనులను కోరారు. తమ పార్టీ అధికారం చేపట్టిన వెంటనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.