SDPT: రాయపోల్ మండలంలో కొత్తగా భూమి పొందిన రైతులు రైతు భరోసా (యాసంగి 2025-26) పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ఇవాళే చివరి రోజని ఏవో నరేష్ తెలిపారు. ఫిబ్రవరి 28లోగా రిజిస్ట్రేషన్ అయిన కొత్త రైతులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులైన రైతులు తమ భూమి పత్రాలతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.