SRCL: సిరిసిల్ల జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఇల్లంతకుంట ZPHSలో బయోలాజీ స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మహేశ్‌చంద్ర ‘ఫిన్లాండ్ టీచర్ ఎక్సేంజ్ ప్రోగ్రామ్’కు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన 5 రోజుల పాటు ఫిన్లాండ్లోని ప్రముఖ యూనివర్సిటీలు, విద్యా సంస్థలను సందర్శించి విద్యా విధానాలపై శిక్షణ పొందనున్నారు.