SRD: ఈ నెల 28న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవాని చంద్ర సూచించారు. న్యాయవాదులతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. పోలీస్, ఎక్సైజ్, బ్యాంక్ కేసులు, దంపతుల వివాదాలను రాజీ ద్వారా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. కోర్టుల చుట్టూ తిరగకుండా త్వరితగతిన న్యాయం పొందేందుకు ఇరువర్గాలు ముందుకు రావాలని కోరారు.