HYD: ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడితే సహించేది లేదని GHMC మాజీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ హెచ్చరించారు. బంజారాహిల్స్‌లోని ఎన్బీటీ నగర్ బస్తీలో అంగన్వాడీ కేంద్రం కోసం కేటాయించిన స్థలంలో కొంతమంది అక్రమంగా బోరు వేస్తున్నట్లు స్థానికులు ఆమె దృష్టికి తీసుకెళ్లారు. దీంతో నిన్న ఆమె ఆ ప్రాంతాన్ని పరిశీలించి, అక్రమ పనులను వెంటనే నిలిపివేయాలన్నారు.