KRNL: వైద్య విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు అవసరమని వీసీ డా. పీ. చంద్రశేఖర్ అన్నారు. కర్నూలు మెడికల్ కాలేజీలో స్పోర్ట్స్ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. ప్రతి కాలేజీకి రూ.10 లక్షలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. క్రీడలు విద్యార్థుల నైపుణ్యాలు, శారీరక దారుఢ్యాన్ని పెంచుతాయని పేర్కొన్నారు.