KRNL: జిల్లాలో ఈ నెల 30న అన్ని నియోజకవర్గాల్లో సామూహిక గృహప్రవేశాల కార్యక్రమం నిర్వహించనున్నందున ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ డా. సిరి అధికారులను ఆదేశించారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్లో హౌసింగ్ పనులపై సమీక్షించారు. ఆప్షన్-3 కింద నిర్మించిన ఇళ్లలో లోపాలను వెంటనే సరిచేయాలని, రూఫ్ లెవెల్ చేరిన ఇళ్లను ప్రాధాన్యంతో పూర్తి చేయాలని సూచించారు.