JGL: మల్యాల మండలం గొర్రెగుండంలో ఫాతిమానగర్ అడోరేషన్ సొసైటి ఆధ్వర్యంలో మనోస్ యూనిదాస్ స్పెయిన్ వారి ఆర్థిక సాయంతో ఫ్లోరైడ్ రహిత మంచినీటి పథకాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్కరు సురక్షిత మంచినీరు తాగడం వలన ఆరోగ్యంగా ఉంటారని, ప్రజల ఆరోగ్యం కాపాడాలనే సంస్థ వాటర్ ప్లాంట్లను అందిస్తున్నట్లు సంస్థ సుపీరియర్ మదర్ అన్సీ అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అంజలి పాల్గొన్నారు.