MDK: మాసాయిపేట మండలం గోపాలకృష్ణపురం సమీపంలోని హల్దీవాగు బ్యాక్ వాటర్లో మంగళవారం ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడు బ్లూ బ్లాక్ లైన్ షర్ట్, బ్లాక్ కలర్ షార్ట్ ధరించి ఉన్నాడని వెల్దుర్తి ఎస్సై రాజు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మృతుడికి సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే వెల్దుర్తి పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని కోరారు.