సత్యసాయి: నల్లచెరువు మండలం పి.కొత్తపల్లిలో ఆటోమేటెడ్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్‌ను కలెక్టర్ శ్యాం ప్రసాద్, వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్ మంగళవారం ప్రారంభించారు. రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర లభించి, వారి ఆదాయం పెరగాలనే ఉద్దేశంతో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీని ద్వారా ముఖ్యంగా వేరుశనగ రైతులకు మెరుగైన ధర లభిస్తుందన్నారు.