TG: బీజేపీలో సొంత పార్టీ నేతలపైనే నమ్మకం లేదని సీఎం రేవంత్ ఆరోపించారు. ‘డీలిమిటేషన్‌పై పోరాటానికి సిద్ధం కావాలి. ఏ లెక్కల ప్రకారం 50 శాతం సీట్ల పెంపు. దక్షిణాది రాష్ట్రాల అవసరం లేకుండా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారు. తమిళనాడు, పుదుచ్చేరిలో పెరిగితే 60 సీట్లవుతాయి. యూపీలో పెరిగితే 160 సీట్లు అవుతాయి’ అని వెల్లడించారు.