AP: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్నాయి. మరోవైపు శాసనమండలి ఉదయం 10 గంటలకు ప్రారంభం అవుతుంది. ఉభయసభలను కల్తీ నెయ్యి వ్యవహారం కుదిపేస్తుంది. శాసనసభకు వైసీపీ దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. కాగా శాసనమండలిలో కల్తీ నెయ్యి అంశంపై చర్చకు వైసీపీ పట్టుపట్టనుంది.