ASR: రాజవొమ్మంగి మండలం జడ్డంగి గ్రామ మడేరు అనకట్ట సమీపంలో శుక్రవారం ఉదయం కారు బోల్తా పడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో కొండపల్లి గ్రామానికి చెందని బీరబోయిన సీతారత్నం (30) మృతి చెందినట్లు జడ్డంగి PHC డా. నాగార్జున తెలిపారు. ఈ ప్రమాదంలో బీరబోయిన బాబూరావు, బీరబోయిన దమయంతి, లక్ష్మీ, వరప్రసాద్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. మృతురాలికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం.