HYD: నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి ఎండ వేడికి ప్రజలు అల్లాడిపోయారు. మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని అంచనా వేశారు.