కోనసీమ: అమలాపురం నియోజకవర్గ ఆత్మ చైర్మన్గా జనసేన నాయకురాలు చిక్కం సుధా మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమెను పలువురు నేతలు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏడిద శ్రీను, సూదా చిన్నా, మహాదశ నాగేశ్వరరావు, ఆకుల సూర్య నారాయణ మూర్తి, కుంపట్ల రమేష్, ఆకుల బుజ్జి, సత్తి శ్రీను, తదితరులు పాల్గొన్నారు.