GNTR: గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల స్థలాల పేరుతో పేదలను మోసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ డీఎస్పీని ఆదేశించారు. గృహ నిర్మాణాల పేరిట అక్రమ వసూళ్లకు పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలొద్దని స్పష్టం చేశారు. బాధితుల ఫిర్యాదులపై విచారణలో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి, స్కామ్లో ఉన్న వారందరిపై చర్యలు తీసుకోవాలన్నారు.