ATP: ఆర్డీటీ సంస్థకు FCRA లైసెన్స్‌ను 2031 వరకు కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించడంపై గుత్తిలో బీఎస్పీ నాయకులు మంగళవారం హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఫెర్రర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంస్థ సేవలు నిరంతరాయంగా కొనసాగేలా ఉత్తర్వులు రావడం శుభపరిణామమని నియోజకవర్గ, మండల నాయకులు పేర్కొన్నారు. అనంతరం సంబరాలు చేశారు.