BDK: గర్భిణులు, బాలింతలు, వృద్ధులు తగిన జాగ్రత్తలు పాటించాలని డాక్టర్ బి. సాయి పృథ్విరాజ్ నాయక్ సూచించారు. ప్రపంచ క్షయ నివారణ దినం సందర్భంగా ఇవాళ దెందుకూరు పీహెచ్సీలో వైద్యులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా టీబీ లక్షణాలు, నివారణ మార్గాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వం ఉచితంగా మందులు అందిస్తున్నట్లు తెలిపారు.