NLG: అక్రమ అరెస్టులతో ప్రజా ఉద్యమాలను ప్రభుత్వం అణచివేయలేదని బీఆర్ఎస్వీ చింతపల్లి మండల అధ్యక్షుడు ఆరెకంటి మురళి అన్నారు. అసెంబ్లీ ముట్టడి పిలుపు నేపథ్యంలో పోలీసులు బీఆర్ఎస్వీ నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల ముందు విద్యార్థులకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.