విజయనగరం: చిన్న వయస్సులో గర్భం దాల్చడంవల్ల కలిగే అనార్థాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని కలెక్టర్ రామ సుందర్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన కౌమార దశలో గర్భధారణ అవగాహన పోస్టర్ను జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్ ఐసీడీఎస్ పీడీతో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.