TPT: ఆన్లైన్ రక్త పరీక్షల్లో టెస్టింగ్ ల్యాబ్స్, ప్రమాణాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రక్త నమూనాలు తీసుకునే టెక్నీషియన్లు అర్హులేనా? ఇందులో రూ.150 వరకు ఏజెన్సీకి వెళితే రూ.149తో పరీక్షలు సాధ్యమేనా? అంతేకాకుండా రక్త నమూనాలను సేకరించే సూదులు, కాటన్ ఎక్కడ వేస్తున్నారు? టెస్టింగ్ అనంతరం సాంపిల్స్ ఏమి చేస్తున్నారు; అన్న వివరాలపై స్పష్టత లేకుండా పోతోందని ప్రజలు వాపోతున్నారు.